క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి

క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీర దారుఢ్యానికి ఎంతో దోహదపడతాయని మాజీ ఎంపిటిసి కందాడి శ్రీరామ్ రెడ్డి అన్నారు. గత పక్షం రోజులుగా నాదర్ గుల్ లో జరుగుతున్న నాదర్ గుల్ ప్రీమియర్ లీగ్ ( ఎన్ పి ఎల్ ) ఆదివారంతో ముగిసింది. ఫైనల్స్ లో నాదర్ గుల్ రాయల్స్, నాదర్ గుల్ క్యాపిటల్స్ తలపడగా రాయల్స్ విజేతగా నిలిచింది.

విజేత జట్టుకు రూ. 55,555, ఎల్చల పురుషోత్తం రెడ్డి, రన్నర్ జట్టు క్యాపిటల్ కు రూ. 33,333 లను బంగారు బాబు అందజేశారు.

ఫైనల్ జట్టు విజేత రాయల్స్ ప్రాంజైసర్ వి. సుభాన్ యాదవ్, రన్నర్ జట్టు ప్రాoజైసర్ శివ ప్రసాద్, నిర్వాహకులు వై సుభాష్ రెడ్డి, టీ. రజినీకాంత్ యాదవ్, అనిల్ రెడ్డి, హరి, హరీష్ రెడ్డి, విజయ్, స్థానిక నాయకులు వై. శ్రీధర్ రెడ్డి, ఆంజనేయులు, మహేంద్ర యాదవ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »