ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు

ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు
జ్ఞాన తెలంగాణ/ భద్రాద్రి/ దుమ్ముగూడెం న్యూస్.జూన్ 9 :
ఏజెన్సీ ప్రాంత పేద ప్రజలకు వైద్య సేవలు అందించటం అదృష్టంగా భావిస్తున్నామని భద్రాచలం పట్టణానికి చెందిన సూర్య హాస్పిటల్ వైద్యులు పవన్ రెడ్డి, గీత పావని అన్నారు. ఆదివారం సూర్య హాస్పిటల్ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం మండలం,లక్ష్మీ నగరం లోని స్టేట్ బ్యాంక్ పక్కన ఉన్న కిడ్స్ స్కూల్ లో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని దుమ్ముగూడెం జడ్పిటిసి తెల్లం సీతమ్మ, ఎంపీపీ రేసు లక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు.