సాలంపాడ్ క్యాంప్ లో ఉచిత వైద్య శిబిరం.

సాలంపాడ్ క్యాంప్ లో ఉచిత వైద్య శిబిరం.

జ్ఞాన తెలంగాణ – బోధన్


సాలూర మండలం సాలంపాడ్ క్యాంప్ గ్రామంలో శనివాలం లయన్స్ క్లబ్ అయ్యప్ప సేవ, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో క్యాన్సర్ , మహిళ ఆరోగ్య సమస్యలు, కంటి పరీక్షలు , షుగర్ పరీక్షలు, ఎక్స్ రే, బీపీ పరీక్షలు నిర్వహించారు.

అనంతరం రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సెక్రటరీ సూరాబత్తుని శ్రీనివాసరావు , జోనల్ చైర్మన్ మారం ఆదినారాయణ రెడ్డి , కోశాధికారి సురా బత్తుని ఆంథోని మేరీ , హనుమంతరావు , తన్నీరు సుబ్బారావు , ఎంపీటీసీ కె.వెంకట్రావు , ఎ.బాలకృష్ణ రెడ్డి , పోశెట్టి , లేళ్ల శైలజ , లిల్లీ కంటి వైద్యులు డాక్టర్ డి.సతీష్, డాక్టరు సూర్యప్రకాష్ , సాయి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »