సోమారపు వంశీల వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు.

సోమారపు వంశీల వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు.
వ్యవస్థాపకులు అధ్యక్షుడు సోమారపు వీరస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొని వీరి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, మహబూబాబాద్,జనగాం కమిటీలు వేయడం జరిగింది.
ఈ సందర్భంగా సోమారపు శ్రీరాములు మాట్లాడుతూ
మన యొక్క వంశం జనగామ జిల్లా ఏడున్నతల గ్రామం నుండి పురుడు పూసుకుని రంగాపురం,దంతాలపల్లి, వివిధ మండలాల్లో వ్యాప్తి చెంది ఉందని వీరందరిని ఒక వేదికపై ఏకం చేయుటకు నడుము బిగించి ముందడుగు వేసిన సోమారపు. వీరస్వామి కి కృతజ్ఞత తెలిపారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఒక వేదికపై కలబోతున్న గొప్ప పండ అన్నారు. మనిషి పుట్టడం గిట్టడం సహజం కానీ వంశీలను ఒక వేదికపై నిలపడం గొప్పతనం అని కొనియాడారు. సోమార్పు వంశీయుల గెట్ టుగెదర్ పోగ్రామను వంశీలంతా ఏకమై విజయవంతం చేయాలనిఅన్నారు. ఈ సందర్భంగా వీరంతా కేసముద్రం అంబేద్కర్ సెంటర్లో గల రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సమావేశం అయ్యారు. ఇట్టి సమావేశ కమిటీలకు అమీనాపురం, ఇంటికన్నె, తాళ్లపూస పల్లి,కేసముద్రం టౌన్ గ్రామాల సోమారపు వంశీయులు శ్రీరాములు హైదర్ ఈశ్వర్ యాకన్న ఎల్లయ్య మదర్ వెంకటయ్య పాల్గొన్నారు
