శిథిలావస్థలో ఉద్యోగుల నివాసాలు

శిథిలావస్థలో ఉద్యోగుల నివాసాలు
జ్ఞాన తెలంగాణ – బోధన్
బోధన్ మండల పరిషత్ కార్యాలయం సమీపంలో గత కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగుల నివాస గృహాలు శిథిలావస్థకు చేరాయి.ప్రభుత్వ శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు గతంలో ప్రభుత్వ క్వార్టర్లలోనే నివాసం ఉండి విధులకు హాజరయ్యే వారు.కాని అవి కొన్నేళ్ల నుంచి వాడకంలో లేకపోవడంతో నేడు అవి శిథిలావస్థకు చేరాయి.వాటి కిటికీలు, తలుపులు చోరికి గురవడంతో పిచ్చి మొక్కలు పెరిగి నిరుపయోగంగా మారాయి. దాంతో అవి ఆకతాయిలకు అడ్డాగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ శిథిలావస్థకు చేరిన గృహాలను తొలగించి ఈ స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణాలకు ఉపయోగిస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.