అంగన్వాడీ ఆధ్వర్యంలో బడిబాటకార్యక్రమం

జ్ఞానతెలంగాణ, చిట్యాల, జూన్ 13:

గురువారం రోజున అంగన్వాడీ బడి బాట కార్యక్రమాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం లో సూపర్వైజర్ జయప్రద సమక్షంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా పలు వీధుల గుండా ర్యాలీ నిర్వహించి రెండున్నర సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు పిల్లలందరిని అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని స్లోగన్స్ ద్వారా అవగాహన కల్పించనైనది. అనంతరం సూపవైజర్ జయప్రద మాట్లాడుతూ…ఈ వయసు పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదగటానికి అంగన్వాడీ కేంద్రాలు తొడ్పాడుతాయి అని ,ప్రైవేట్ స్కూల్ కి పంపించడం వల్ల ఎదుగుదల కుంటుపడిపోయి ఆర్థికంగా తల్లి తండ్రులకు నష్టం వాటిళ్లుతుందిఅన్నారు అలాగే వ్యాన్, ఆటో లలో పంపించడం వల్ల పిల్లలు భద్రంగా ఇంటికి చేరుకునేవరకు ఆందోళన చెందుతుంటారు. ఉదయం 7 గంటలకు వండిన వంటను బాక్స్ లో పెట్టి ఇవ్వడం వల్ల చల్లారిపోయి, పాడయిపొయి పిల్లలు తినలేక అనారోగ్యానికి గురవుతున్నారు కావున అంగన్వాడీ కి పంపించడం వల్ల బుక్స్ వేడి వేడి భోజనం ఆట పాటలతోటి ఆహ్లాదకరమైన వాతావారణాన్ని కల్పించడం జరుగుతుంది అని అవగాహనా కల్పించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ముగ్గురు పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కట్కూరి పద్మ, పంచాయతీ కార్యదర్శి రవి కుమార్,స్కూల్ టీచర్స్ నీలిమ, అనిత, సుజాత,వి.ఓ అధ్యక్షురాలు శారద,అంగన్వాడీ టీచర్స్ సంధ్యారాణి, భాగ్యలక్ష్మి, అరుణ, సుజాత, జ్యోతి ఆయా పద్మ, తదితరులు పాల్గొన్నారు..

You may also like...

Translate »