కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు:డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్

భారాసను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్దపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టాక,ప్రజలకు చేసిందేమీ లేదని నాగర్ కర్నూల్ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో కలిసి తెల్కపల్లిలో రోడ్ షోలో నిర్వహించారు.ఆరు గ్యారంటీల్లో పేదలకు ఎన్ని పథకాలు లబ్ధిచేకూరాయో ప్రజలు ఆలోచించుకోని, రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ, రైతుబంధు,కళ్యాణ లక్ష్మీ కింద ఆడ బిడ్డలకు తులం బంగారం ఇవ్వడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. చాణక్యనీతి సర్వేలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని 45 శాతం ఓట్లతో భారాస గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్,బిజెపి పార్టీలు ద్వితీయ,తృతీయ స్థానాల్లో ఉన్నాయని తెలిపారు.కేసీఆర్‌ హయాంలోనే తెలంగాణ అనేక రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. తను గురుకులాల కార్యదర్శిగా పదేళ్లు పనిచేసి,లక్షలాదిమంది పేద విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేరేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించానన్నారు.ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాల కన్నా గొప్పగా తీర్చిదిద్దానని తెలిపారు.

అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోలీసు పహారా లేకుండా ప్రజల్లోకి రావడం లేదన్నారు.ఇప్పుడు జరిగే ఎన్నికలు కేసీఆర్ పదేళ్ల నిజమైన పాలనకు,అబద్ధపు హామీలిచ్చిన కాంగ్రెస్ పాలనకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధులు తీసుకువచ్చి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

పేద విద్యార్థుల భవిష్యత్ కు మేనమామనవుతా:మర్రి జనార్దన్ రెడ్డి

వెనుకబడిన నాగర్ కర్నూల్ ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకు తమవంతుగా సాయం అందించి,వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు.ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి, విద్యార్ధులకు అన్ని సౌకర్యాల కల్పనకు కృషి చేస్తామన్నారు. పథకాల అమలు పేరుతో ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నాడని అన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్,బిజెపి ఇచ్చే మోసపూరిత వాగ్దానాలు నమ్మి ప్రజలు మోసపోవద్దని తెలిపారు.ర్యాలీలో పార్టీ సీనియర్ నాయకులు నాగం శశిధర్ రెడ్డి స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

You may also like...

Translate »