చివరి రోజు జోరుగా ఇంటింటికి ప్రచారం .

చివరి రోజు జోరుగా ఇంటింటికి ప్రచారం .
ఫోటో. మందర్న గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులు.
జ్ఞాన తెలంగాణ- బోధన్
పార్లమెంటు ఎన్నికల చివరి ముగింపు ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయా పార్టీల నాయకులు ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ నాయకులు వారి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేపట్టారు .మందర్న గ్రామంలో రైతు నాయకులు మందన్న రవి, సాలూరులో అల్లె రమేష్, బోధన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు శరత్ రెడ్డి, కౌన్సిలర్లు ఇంటింటికి తిరుగుతూ కాలనీలలో ప్రచారం నిర్వహించారు . అలాగే టిఆర్ఎస్ మండల అధ్యక్షులు నాగేంద్రబాబు పలు గ్రామాలలో బాజిరెడ్డి గోవర్ధన్ తో రోడ్ షోలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
