బడిబాటలో ప్రభుత్వ పాఠశాలలపై ఇంటింటికి ప్రచారం .

ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్న ఉపాధ్యాయులు.


జ్ఞాన తెలంగాణ – బోధన్
బడిబాట కార్యక్రమంలో భాగంగా బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జేసీ) ఉపాధ్యాయులు ఆదివారం బడిబాట కార్యక్రమంలో భాగంగా రాకాసిపేటలోని గాంధీ నగర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాల పై అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు రాచప్ప మాట్లాడుతూ విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చేరి చదువుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, ఉచితంగా దుస్తులు ,మధ్యాహ్న భోజనం, ఉచిత పుస్తకాలు అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం మంజూరు చేయడం జరుగుతుందని సూచించారు.

కావున విద్యార్థులు ఈ బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో చేరి ప్రభుత్వం అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు వసీం సుల్తానా ఉన్నారు .

You may also like...

Translate »