రాసి పెట్టుకోండి.. “డీకే అరుణమ్మ”కు 2 లక్షల మెజార్టీ..!

రాసి పెట్టుకోండి.. “డీకే అరుణమ్మ”కు 2 లక్షల మెజార్టీ..!
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు “పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి” షాద్ నగర్ నియోజకవర్గంలో నియోజకవర్గంలో భారీ ప్రచారం వెలిజర్ల, వెంకన్నగూడ, కొండన్నగూడ, బుచ్చిగూడ, కమ్మదనం, గంట్లవెళ్లి, మధురాపూర్ గ్రామాల్లో విస్తృత ప్రచారం
భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డీకే అరుణమ్మ విజయం దాదాపు ఖాయమైపోయిందని, అందరూ బాగా రాసి పెట్టుకోండి.. రెండు లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందడం ఖాయమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం వెలిజర్ల, కొండన్నగూడ, బుచ్చి గూడ, కమ్మదనం, గంట్లవెళ్లి, మధురాపూర్ తదితర గ్రామాల్లో డీకే అరుణమ్మ తరఫున పెద్ద ఎత్తున పార్టీ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లో పలువురిని పార్టీలో చేర్చుకున్నారు. ఆయా గ్రామాల్లో విష్ణన్న అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ పల్లెకు వెళ్లినా మూలకున్న ముసలమ్మ కూడా డీకే అరుణమ్మ పేరును స్మరిస్తోందని అన్నారు.
మోడీ ముద్ర గ్రామాల్లో చాలా గట్టిగా పాతుకుపోయిందని అన్నారు. పార్లమెంటును అభివృద్ధి చేయాలంటే ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా డీకే అరుణకు గొప్ప గుర్తింపు ఉందని అన్నారు. ఆమె రాజకీయ చతురత పాలమూరు జిల్లా కోసం చేసిన ఉద్యమాలు కష్టపడ్డ తీరు ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంతో అనుభవం ఉందని అన్నారు. ఆమె రాజకీయ జీవితంలో అనేకమంది రాజకీయ ఉద్దండులను ఎదుర్కొని విజయవంతంగా రాజకీయం చేశారని ఇప్పుడు మరోసారి పార్లమెంటు అభ్యర్థిగా ప్రజల ముందుకు రాబోతున్నారని ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రెండు లక్షల పైచిలుకు మెజారిటీ ఆమె ఎంపీగా రావడం ఖాయమని ఈ సందర్భంగా దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలో చేరిన వారిలో మేక నరేందర్ రెడ్డి, కమ్మరి యాదగిరి చారి, వడ్ల ప్రశాంత్ చారి, మట్ట రవి గౌడ్, వాసు గౌడ్, కావలి యుగేందర్, జయంత్, నరసింహ, వడ్ల సిద్దు, అఖిల్, పవన్, రాజు, నరేష్, వెంకటేష్, యాదగిరి, తదితరులు ఉన్నారు.. కేపీ
