వ్యక్తి అదృశ్యం

జ్ఞాన తెలంగాణ
శంషాబాద్ రూరల్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని బహదూర్ గూడ గ్రామానికి చెందిన వ్యక్తి అదృశ్యమైనాడు.
శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్ తెలియజేసిన వివరాలప్రకారం బహదుర్ గూడ గ్రామానికి చెందిన కావాలి కుమార్ 40 వృత్తి :డ్రైవర్ ఆర్థిక సమస్యల వల్ల కుటుంబసభ్యులు ఇంట్లో గొడవ పడ్డారు అదే సమయంలో కావలి కుమార్ ఇంటి నుండి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇంటికి తిరిగిరాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు కుమార్ కోసం చుట్టుపక్కల ప్రాంతాలలో మరియు బంధువుల ఇళ్లలో వెతికినా అతని ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్ ని అశ్రాయించారని తెలియజేసారు.అదృష్యమైన కుమార్ యొక్క వివరాలు: ఎత్తు 5.0” అడుగులు, రంగు: చమంచాయా మరియు బ్లూ కలర్ షర్ట్ మరియు వైట్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడని అతను తెలుగు భాష మాట్లాడతాడని తెలియ జేశారు. ఇట్టి విషయము పై చర్య తీసుకోవాలని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

You may also like...

Translate »