పోలీసుల ప్రతిష్టను దిగజారిస్తే సహించలేదు: సి పి

జ్ఞాన తెలంగాణ హనుమకొండ

పోలీసు విభాగం కీర్తి ప్రతిష్టలను దిగజార్చే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో బుధవారం నాడు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో డిసిపిలు, అదనపు డీసీపీలు,ఏసీపీలు సబ్ ఇన్స్పెక్టర్,ఆర్ఐలు,ఎస్సైలు పాల్గొన్నారు.సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా శాంతి భద్రతలకు సంబంధించిన పలు అంశాలపై అధికారులతో చర్చించడంతోపాటు,వచ్చేనెల నాలుగో తేదీన ఎనుముల మార్కెట్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన పోలీస్ బందోబస్తుతో పాటు, ఎన్నికల ఉల్లంఘలకు పాల్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో ముచ్చటించడంతోపాటు, చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులు అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా జూన్ 9న నిర్వహించబడే గ్రూప్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు గాను పోలీసుల పరంగా తీసుకుంటున్న చర్యలపై పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.వర్షాకాలం సమీపిస్తున్న వేళ రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా స్థానిక పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిందిగా పోలీస్ కమిషనర్ అధికారులను ఈ సమావేశంలో సూచించారు.

You may also like...

Translate »