సిపిఐ,సిపిఎం విస్తృతస్థాయి సమావేశనికి బయలుదేరిన సిపిఎం పార్టీ నేతలు:

జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, మే 4:

శనివారం మహబూబ్నగర్ లో జరగబోయే సీపీఎం పార్టీ పార్లమెంటు జిల్లా విశృత స్థాయి సమావేశం శ్రీ సాయి క్రిష్ణ ఫంక్షన్ హాల్ లో ఏర్పర్చిన ఇట్టి సమావేశానికి ముస్తాపేట్ గ్రామం నుండి సీపీఎం పార్టీ సభ్యులు బయలు దేరారు. సిపిఎం జిల్లా నాయకులు అంజిలయ్య గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగం,ప్రజాస్వామ్యం,ప్రాథమిక హక్కులు,ఓటింగ్,ఎన్నిక ఎంత బలహీనంగా వున్నా,ప్రజలకు దానిలో నుంచి మెరుగైన లౌకిక, ప్రజాస్వామిక విలువలను పెంపొందించుకోవాలనే ఆశ వుండేది.ప్రజాస్వామిక హక్కులకు వ్యతిరేకమైనది.ముస్లిములు,క్రిస్టియన్లు మాత్రమే దానికి శతృవులు కాదు. హిందువులలోని 80 శాతం దళిత,ఆదివాసీ, పేద,బలహీన వర్గాలకు వ్యతిరేకమైనది.దాని కోసం వారిలో మెజారిటీ మత ఉన్మాదాన్నీ, విద్వేషాగ్నినీ,ఉద్వేగాన్నీ కలిగిస్తున్నది. వాస్తవంగా బీజేపీ,ఎన్డీఏ కూటమి అనుసరించిన ఆర్థిక,రాజకీయ విధానాలన్నీ ఈ దేశంలోని అన్ని మతాలలోని,అన్ని కులాలలోని 90 శాతం ప్రజలకు వ్యతిరేకమైనదని.అంబానీ,ఆదానీ లాంటి కార్పోరేట్ వాళ్లకు ప్రయోజనం కలిగించేవి. వీరి హయాంలో దేశంలో 1% ధనికుల చేతిలోకి 40% సంపద పోగుపడుతున్నది.10 శాతం ధనవంతుల చేతుల్లోకి 80 శాతం సంపద పోగవుతున్నది.తీవ్ర అంతరాలను సమాజంలో పెంచుతూ,మత ప్రాతిపదికగా, ప్రజలను చీల్చి తమ ప్రజా వ్యతిరేక విధానాలను కప్పిపెట్టు కుంటున్నది. నిత్యావసరాలైన గ్యాస్,పెట్రోల్ ధరలు పెంచింది.జీఎస్టీతో చిన్న పరిశ్రమలను దెబ్బ తీసింది.అవినీతిని తారాస్థాయికి తీసుకెళ్లిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. మతోన్మాద ఫాసిస్టు నిదానలను అనుసరిస్తున్న బిజెపి,ఆర్ఎస్ఎస్ ఎన్డీఏ కూటమిని ఓడించాలని,ఇండియా కూటమినీ బలపరచాలని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు అటువైపు ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు.ఈ సమావేశానికి సీపీఎం పార్టీ జిల్లా నాయకులు అంజీలయ్య గౌడ్, సీపీఎం గ్రామ కార్యదర్శి కె లాలప్ప, కేవీపీఎస్ నాయకులు బి లాలప్ప, డి వై ఎఫ్ ఐ నాయకులు గోవిందు,గ్రామ యువకులు వెళ్ళడం జరిగింది

You may also like...

Translate »