కార్పోరేట్ అనుకూల బీజేపి నీ ఓడించండి

కార్పోరేట్ అనుకూల బీజేపి నీ ఓడించండి

జ్ఞాన తెలంగాణ నారాయణపేట టౌన్ మే 10:

దామరగిద్ద మండల పరిధిలోని దేశాయిపల్లి గ్రామంలో ఇండియా కూటమీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డిని గెలిపించాలని సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంజిలయ్య గౌడ్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాకముందు నేను ఒక బీసీ బిడ్డను చాయి వాలను పేదల కష్టమేందో నాకు తెలుసు నన్ను ప్రధానమంత్రి చేస్తే ఈ దేశంలో ఉన్న పేదలకు కూలీలకు నల్ల కుబేర్ల యొక్క నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని హామీ ఇచ్చి అదే మోదీ అధికారంలోకి వచ్చాక పేదల మీధ మాత్రం ధరల భారాలు మోపుతూ పెద్దలకు మాత్రం లక్షల కోట్లు రుణాలు మాఫీ చేశారని దుయ్యబట్టారు.కాబట్టి పేదలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మోడీని గద్దెద్దించాలని కోరారు.ఇండియా కూటమి బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నీ గెలిపించాలని అన్నారు.కార్యక్రమంలో సీపీఎం నాయకులు అంజప్ప, భాస్కర్ రెడ్డి, కె గోవిందు,రాములు, సత్తి, బి రాము, కాంగ్రెస్ నాయకులు గోవిందు, బసంత్ రెడ్డి, వెంకట్రామి రెడ్డి, వేంకటప్ప, లాలప్ప తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »