చరిత్రలో నిలిచిపోయిన మహనీయుడు అంబేద్కర్

చరిత్రలో నిలిచిపోయిన మహనీయుడు అంబేద్కర్
జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:
-స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మంచాల ఎల్లయ్య గారు..
జనగామ జిల్లా జఫర్ గడ్ మండలంలోని సాగరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి భూమి పూజ కార్యక్రమంలో బుధవారం *స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మంచాల ఎల్లయ్య ** పాల్గొన్నారు…ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగ రూప కర్తగా, న్యాయవాదిగా ఆర్థిక శాస్త్రవేత్తగా రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా ఇలా అన్ని రంగాల్లో సేవ చేసిన మహా నీయుడు అంబేద్కర్ అని కొనియాడారు..ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…