దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేసి చూడండి :

దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేసి చూడండి :
జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అమిత్ షా మాటలను వక్రీకరించారని సీఎం రేవంత్ రెడ్డిని నోటీసులు ఇచ్చి బెదిరిస్తున్నారు. బిజెపి ప్రభుత్వానికి దమ్ముంటే సీఎంను అరెస్టు చేసి చూడండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. హుస్నాబాద్ నియోజకవర్గం పరిధిలోని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచర్ల రాజేందర్రావుకు మద్దతుగా మంగళవారం ప్రచారంలో భాగంగా ముల్కనూర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అమిత్ షాపై ఒక వీడియో వస్తే,మండిపోతున్నారని సోనియా గాంధీ. రాహుల్ గాంధీ. ప్రియాంక గాంధీ. లపై మల్లికార్జున కర్గే ఎన్నో దొంగ వీడియోలు సృష్టిస్తే ఒక చర్య కూడా తీసుకున్నారా అని ప్రశ్నించారు. బిజెపి ఐటి చీఫ్ అమిత్ మాల్యా వందల సంఖ్యలో ఫేక్ పోస్ట్ లు పెట్టారని ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదని ఫిర్యాదు చేశారు.
మతం పేరుతో పిల్లలను రెచ్చగొడుతున్నారని. ఆరోపించారు రాముడి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని. దమ్ముంటే బండి సంజయ్. గత పార్లమెంటు ఎంపీగా కరీంనగర్ పార్లమెంటుకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూపించి ఓట్లు అడగాలన్నారు. గత ఎంపీలు వినోద్ కుమార్.బండి సంజయ్. కరీంనగర్ కరీంనగర్ పార్లమెంటు ఏం అభివృద్ధి చేశారో ముల్కనూర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా చర్చకు సిద్ధమ అని నిలదీశారు. త్వరలో గౌరవెల్లి రిజర్వాయర్ తో పాటు దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు మాట ప్రకారం ఆగస్టులో రుణమాఫీ చేస్తామన్నారు బిజెపి, బిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేస్తే లాభం లేదని మన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని సూచించారు.
