రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఆర్థిక సాయం అందజేసిన చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జ్ భీమ్ భరత్

జ్ఞాన తెలంగాణ న్యూస్// వికారాబాద్ జిల్లా // నవాబుపేట్ మండలం// ఎల్లకొండా గ్రామంలో రోడ్డు ప్రమాదం లో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి
గురువారం పులుసుమామిడి గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన ,గాయపడిన గ్రామస్తులను పరామర్శించి ఓదార్చారు. చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జీ పామేన భీమ్ భరత్ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ కొంత ఆర్థిక సహాయం చేసి కాంగ్రెస్ పార్టీతో మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షుడు వెంకటయ్య ,వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్,నియోజకవర్గ యువజన కాంగ్రెస్ కార్యదర్శి ఉపేందర్ రెడ్డి ,నాయకులు వెంకట్ రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి , తదితర సీనియర్ నాయకులు పాల్గొన్నారు…

You may also like...

Translate »