కాంగ్రెస్ పార్టీ గెలుపు పట్ల సంబరాలు

కాంగ్రెస్ పార్టీ గెలుపు పట్ల సంబరాలు
బాణా సంచా కాలుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసిన
కాంగ్రెస్ పార్టీ నాయకుడు తడక వెంకటేశం
జ్ఞాన తెలంగాణ (భూదాన్ పోచంపల్లి)
భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పోచంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు తడక వెంకటేశం కార్యకర్తలతో కలిసి పటాకులు కాలుస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తడక వెంకటేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి చూసి ప్రజలు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని ఆయన అన్నారు.భువనగిరి నియోజకవర్గం మరింతగా అభివృద్ధి జరుగుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
