నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి దొంగలు.

  • మెటల్ వైర్ దొంగిలించిన దుండగులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇంటి యజమాని
    జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) నిర్మాణం లో ఉన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి దోచుకెళ్ళిన సంఘటన ఆదిభట్ల మున్సిపాలిటీ లో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితేఆది బట్ల మున్సిపాలిటి పరిధిలో ఉన్న కొంగర కలాన్ 7వ వార్డ్ లో తేదీ29 రాత్రి 12:30 నిమిషాల సమయంలో దొంగలు వచ్చి బిల్డింగ్ మొత్తం జి ప్లస్ టు విత్ పెంటావుజ్ కరెంట్ వైర్ మెటల్ బోర్డ్ లో నుండి వైర్ ను దొంగిలించారు.నిర్మాణ దారుడు ఉడుగుల భాస్కర్ గౌడ్ జి ప్లస్ టు విత్ పెంటావుజ్ లో నిర్మాణ దశలో ఉన్న ఇంట్లోకి అర్ధ రాత్రి దొంగలు వచ్చి మెటల్ బోర్డ్ లో ఉన్న వైర్ మొత్తాన్ని దొంగిలించారని తెలిపారు .30 వ తేదీన గురువారం ఉదయం వచ్చే సరికి మెటల్ బోర్డ్ లో ఉన్న వైర్ అంతా కట్ చేసిన దృశ్యాలు చూసి పోలీసులకు ఫోన్ చేయడంతో.సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు క్రైమ్ ఫోలీస్ రమేష్ తెలిపారు .త్వరలో దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా పెట్టి సీసీ కెమెరాలు చూసి దొంగలు పట్టుకుంటామని తెలపడం జరిగింది.
    ఇంటి యజమాని ఉడుగుల భాస్కర్ గౌడ్ మాట్లాడుతు మా ఇల్లు చౌరస్తా లో ఉండటం వలన నిత్యం రద్దీగా ఉండే చోటు కనుక సీసీ కెమెరాలు పెట్టుకోలేదని.గత రోజున గ్రనేట్ పని వాళ్ళు సాయంత్రం వరకు గ్రనేట్ బండలను వేయడం జరిగింది.రాత్రి 8 గంటల వరకు మా నాన్న అక్కడే ఉన్నారని.ఉదయం 7:30 నిమిషాలకు మా అన్న వచ్చే సరికి మెటల్ బోర్డ్ వద్ద జి ప్లస్ టు విత్ పెంటావుజ్ మొత్తం వైర్ కట్ చేసుకొని ఉన్న దృశ్యాలను చూసి నేను ఆది బట్ల పోలీస్ వాళ్ళ కు ఇన్ ఫామ్ చేయడం జరిగింది అన్నారు.పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నట్లు క్రైమ్ పోలీసుల చెప్పడం జరిగింది అన్నారు.మెటల్ బోర్డ్ చివరి వరకు జి ప్లస్ టు విత్ పెంటావుజ్ వరకు వైర్ కట్ చేయడం వలన పాల్ సీలింగ్ మొత్తం డామేజ్ చేసి మళ్ళి కొత్తగా వైర్ గుంజడం వలన లక్షల్లో ఖర్చు అవుతుంది అన్నారు.ఇలాంటి దొంగ తనాలు జరుగ కుండా దొంగ తనాలు చేస్తున్న వారిని పట్టుకొని తగిన చర్యలు భాస్కర్ గౌడ్ కోరారు.

You may also like...

Translate »