బుద్ధె రాజేశ్వర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ అభ్యర్థి.


సాలూర మండల కేంద్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు స్వర్గీయ బుద్ధె రాజేశ్వర్ గత పది రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందిన విషయం తెలిసిందే. బుద్ధె రాజేశ్వర్ మృతి వార్త తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మంగళవారం సాలూరలో జరిగిన ఎన్నికల ప్రచార సభ అనంతరం ఆయన ఇంటికి వెళ్లి బుద్ధె రాజేశ్వర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయామని ఆయన లేని లోటు తీర్చలేనిదని జీవన్ రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు .ఆయనతోపాటు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ,స్థానిక నాయకులు ఇల్తెపు శంకర్, గాండ్ల రాజేశ్వర్, అల్లె రమేష్ , జనార్ధన్, స్వామి గౌడ్, రాజ గౌడ్, శివకాంత్ పటేల్, మైదపు నాగరాజు, బుయన్ సురేష్, నరేందర్ రెడ్డి తదితరులున్నారు.

You may also like...

Translate »