తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష జంగిలి యాదగిరి

తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష జంగిలి యాదగిరి
వెల్డండ, మే,03(జ్ఞాన తెలంగాణ న్యూస్)
బిఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా వెల్దండ మండల కేంద్రలో బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు జంగిలి యాదగిరి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు,ఈ కార్యక్రమంలో యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి బిఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అలాగే తెలంగాణ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెగించి కొట్లాడేది బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రమే అని అన్నారు, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ నాయకత్వం ఎంతో అవసరమని పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు
