కాంగ్రెస్ గూటికి గుడిపల్లి రవికాంత్ రెడ్డి

కాంగ్రెస్ గూటికి గుడిపల్లి రవికాంత్ రెడ్డి


జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల:


బీఆర్ఎస్‌కి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు గుడుపల్లి రవికాంత్ రెడ్డి శనివారం చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గం ఇంఛార్జ్ పామేనా బీమ్ భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరారు.

ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్వంత గూటికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు కృషి చేస్తానని చెప్పారు. పార్టీలో అందరితో కలిసిమెలిసి ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చేవెళ్ల గ్రామ సర్పంచ్,పీఎసీఎస్‌ ఛైర్మన్లు, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు,యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, కార్యక్రమంలో పాల్గొన్నారు.

You may also like...

Translate »