జలీల్ ఆధ్వర్యంలో ఘనంగా పిసిసి డెలిగేట్ తంగేళ్లపల్లి రవి కుమార్ జన్మదిన వేడుకలు


జ్ఞాన తెలంగాణ భువనగిరి జూన్ 8
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పీసీసీ సభ్యులు తంగళ్ళపల్లి రవికుమార్ జన్మదిన సందర్భంగా శనివారం రోజున ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లొ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మొహమ్మద్.జలీల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి,రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జలీల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పిసిసి డెలిగేట్ మెంబర్ తంగేళ్లపల్లి రవి అన్న ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజలను కష్టాలను తీరుస్తూ పేద ప్రజల కోసం పాటుపడుతూ త్రిబుల్ ఆర్ లో భూములు కోల్పోయిన రైతుల కోసం పోరాటం చేస్తూ అన్నా అంటూ నేనున్నానని భరోస కల్పించారు.
పేద విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాలు తనకు తోచినంత ఆర్థిక సహాయం చేస్తూ ఎప్పుడు ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తి రవి అన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అల్లా దయ,స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో అన్న సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి పిట్టల బాలరాజు,భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్ కైరం కొండ వెంకటేశ్వర్,మైనార్టీ సెల్ కార్యదర్శి గౌరీ, గుమ్మడి రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అవిశెట్టి పాండు,వినయ్, తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »