పుట్టిన రోజున ప్రచారంలొనే సబితమ్మ

స్వగ్రామం కౌకుంట్ల ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

బీఆర్ఎస్ అభ్యర్థి,బీసీ ఉద్యమ నేత కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించాలని డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి గారు,యువనేత కౌశిక్ రెడ్డి గార్లతో కలిసి కౌకుంట్లలో ముమ్మరంగా ప్రచారం.

కారుకు జై కొట్టిన కౌకుంట్ల….. సబితమ్మ వెంటే నడుస్తాం అన్న ప్రజలు.

జ్ఞాన తెలంగాణ చేవెళ్ల మే05

బీఆర్ఎస్ అధినేత ఖారారు చేసిన పార్టీ అభ్యర్థి కాసాని గెలుపే లక్ష్యంగా మండే ఎండలను లెక్కచేయకుండా పార్లమెంట్ పరిధిలో సుడిగాలి పర్యటనలు చేస్తూ మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు ప్రచారం నిర్వహిస్తున్నారు.కౌకుంట్లలో ఆదివారం జరిగిన సభలో సబితా ఇంద్రారెడ్డి గారు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలం అయ్యాయని విమర్శించారు.ఇప్పటికే గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలం కాగా,పదేళ్ల పాలనలో ప్రజా సంక్షేమం పట్టక, తెలంగాణకు నయా పైసా సహాయం చేయకపోగా,విభజన హామీలు అమలు చేయక,దేశమంతా విద్యాలయాలు ఇచ్చి రాష్టానికి ఒక్కటీ ఇవ్వలేదని,వరదలు వస్తే కూడా పైసా ఇవ్వలేదని,మళ్ళీ బీజేపీ కూడా గ్యారంటీలు అంటూ ప్రజలకు మోసం చేయాటానికి ముందుకు వస్తున్నారని ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నుండి పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు గతంలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ తరుపున నిలబెడితే ఎంపీలుగా గెలిపించారని,మళ్ళీ మూడోసారి బీసీల ముద్దుబిడ్డ కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఇద్దరు ఎంపీలు కౌకుంట్ల గ్రామానికి ఎలాంటి నిధులు ఇవ్వలేదని పేర్కొన్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 న రైతు బంధు 15 వేలు,రెండు లక్షల రుణమాఫీ,4 వేల పెన్షన్లు, మహిళలకు ఆర్థిక సహాయం,యువతకు నిరుద్యోగ భృతి లాంటి వాగ్దానాలు ఇచ్చి అమలు చేయలేదన్నారు.ఇపుడు మళ్ళీ దేవుళ్ళ మీద ఓట్లు వేస్తున్నారని వీటిని ప్రజలు నమ్మటం లేదన్నారు.తెలంగాణ వాణి పార్లమెంట్ లో వినిపించాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు.కేసీఆర్ గారి సభలకు విశేష స్పందన వస్తుంటే పాలక పక్షాలు గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు.5 నెలల్లో రేవంత్ పరిపాలన చూసి కేసీఆర్ ను ఎందుకు వదులుకున్నాం అని నేడు ప్రజలు బాధపడుతున్నారన్నారు.కేసీఆర్ పాలనలో రెప్పపాటు కరెంట్ పోకుండే…ఇపుడు తరుచూ పోతుందన్నారు.96 బీసీ కులాలను ఏకం చేసిన గొప్ప నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించుకుని సత్తా చాటాలన్నారు.పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కోసం పార్లమెంట్ లో గట్టిగా పోరాటం చేస్తారన్నారు.కేంద్ర బీజేపీ ప్రభుత్వం పదేళ్లు ఏమి చేయలేదని,మోడీని చూసి ఓట్లు వేయమని బీజేపీ అభ్యర్థి అభ్యర్థిస్తున్నారని పేర్కొన్నారు.ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ అని,ఒక్క విద్యాలయం ఇవ్వలేదని,పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు.కళ్యాణాలక్ష్మి లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.కేసీఆర్ కష్టాల్లో ఉన్న రైతుల వద్దకు వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారని,ప్రజల పట్ల,రైతుల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం అన్నారు.ఈ నెల 13 న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు..

You may also like...

Translate »