ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బహుజన విద్యార్థి గర్జన

తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్ కోసం స్వేరో స్టూడెంట్స్ యూనియన్ (SSU) నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారిగా ప్రతి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బహుజన విద్యార్ధి గర్జన భారీ బహిరంగ సభను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్టోబర్ 12 వ తేదీన పెద్దపల్లి పట్టణ ప్రాతంలో ప్రతిష్టాత్మకంగా నిర్బహించబోతున్నామని, ఈ కార్యక్రమానికి స్వేరోస్ ఫౌండర్ తెలంగాణ బి.ఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ సార్ గారు హాజరు కానున్నారు అని స్వేరోస్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి,ఉమ్మడి కరీంనగర్ బహుజన విద్యార్ధి గర్జన కన్వీనర్ అందే అజయ్ గారు తెలిపారు
ఈ కార్యక్రమానికి భావ సారూప్యత కల్గిన అన్ని విద్యార్ధి సంఘాలను కలుపుకొని,ఐక్య కార్యాచరణ తో కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతున్నామని,ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని విద్యార్ధి విద్యార్థులందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.