కాగజ్ నగర్ లో జర్నలిస్ట్ పై దాడి.

కాగజ్ నగర్ లో జర్నలిస్ట్ పై దాడి.
విచక్షణారహితంగా కొట్టిన అక్రమ మైనింగ్ నిర్వాహకులు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు
కాగజ్ నగర్ కు చెందిన ఆదాబ్ హైదరాబాద్ విలేఖరి అంగల తిరుపతి పై సోమవారం అక్రమ మైనింగ్ నిర్వాహకులు దాడి చేశారు.
కాగజ్ నగర్ మండలం చారిగాం రహదారిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. జేసిబి తో మట్టి తవ్వి ట్రాక్టర్ల లో నింపుతుండగా జర్నలిస్ట్ తిరుపతి ఫోటోలు తీసేందుకు అక్కడికి వెళ్ళాడు.
అక్కడ ఉన్నవారు తిరుపతిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బూతులు తిడుతూ దాడి చేశారు.
దీనిపై కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో బాధితుడు తిరుపతి ఫిర్యాదు చేశాడు. కాగజ్ నగర్ జర్నలిస్టులు ఆయనకు సంఘీభావం తెలిపి జర్నలిస్ట్ పై దాడి జరిపిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో జర్నలిస్ట్ యూనియన్ ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.