మొయినాబాద్ లో అంబరాని అంటిన సంబరాలు

మొయినాబాద్ లో అంబరాని అంటిన సంబరాలు
జ్ఞాన తెలంగాణ మొయినాబాద్ జూన్ 4:-
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుతో మండల కేంద్రంలో బీజేపీ శ్రేణులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ పరస్పరం కృతజ్ఞతలు తెలుపుకున్నారు. విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుతో నియోజకవర్గం లో బీజేపీ మరింత బలపడింది అని సంతోషించారు. ఆయన గెలుపుకు కృషి చేసిన అందరికి మండల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు మామిడి మధుసూదన్ రెడ్డి,పట్లోళ్ల ప్రభాకర్ రెడ్డి, కంది నగేష్,అడ్వకేట్ శ్రీధర్, వన్నడ శివ కుమార్,రవీందర్ రెడ్డి, విజయ్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.