రైతులందరికీ ఆగస్టు 15వ తేదీ లోపు బే షరతుగా రైతు రుణమాఫీ చేయాలి

రైతులందరికీ ఆగస్టు 15వ తేదీ లోపు బే షరతుగా రైతు రుణమాఫీ చేయాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్
జ్ఞాన తెలంగాణ చేవెళ్ల /మొయినాబాద్
ఈరోజు మొయినాబాద్ మండలంలోని సజ్జన్ పల్లి గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ మొయినాబాద్ మండల కౌన్సిల్ సమావేశం సిపిఐ మండల కార్యదర్శి కె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య హాజరై మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులు తీసుకున్న పంట రుణాలను ఆగస్టు 15 లోపు మాఫీ చేస్తానని అనేక దేవుళ్ళ పైన ప్రమాణం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులందరికీ రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని పాఠశాలల్లో జీవో నెంబర్ 1కి విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్నారని అధిక ఫీజులను వసూలు చేస్తున్న ప్రైవేటు స్కూల్ యాజమాన్య లపై విద్యాశాఖ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు పార్టీ శ్రేణులు ప్రజా సంఘాల నిర్మాణం చేపట్టాలని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ తరపున పోటీలో ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు
అజిత్ నగర్ గ్రామంలో ఏఐటీయూసీ జెండాను కూల్చిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి
ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి
జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ డిమాండ్
అజిత్ నగర్ గ్రామంలో మండల ఏ ఐ టి యు సి కార్యదర్శి బోనాల ప్రభాకర్ మరియు కార్మికులు కలిసి 15/6/2024 శనివారం రోజున గ్రామంలో ఏఐటీయూసీ జెండా దిమ్మెను నిర్మించారు అదే రోజు రాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు జెండా దిమ్మెను కూల్చి వేశారు జెండా దిమ్మెను కూల్చివేసిన దుండగులను పోలీసు వారు గ్రామంలో పర్యటించి గ్రామంలో ఉన్న సిసి కెమెరాలను పరిశీలించి దుండగులను వెంటనే అరెస్టు చేయాలని లేనిచో కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా కార్యదర్శి వడ్ల మంజుల జిల్లా ఏఐటీయూసీ నాయకులు రఘు నారాయణ మండల సహాయ కార్యదర్శి వెంకటయ్య ఏ ఐ వై ఎఫ్ జిల్లా నాయకుడు ఎండి జలీల్ సత్యనారాయణ గౌడ్ ఎండి జాంగిర్ శ్యాంసుందర్ మంగలినర్సింలు కే రాములు మహేందర్ తదితరులు పాల్గొన్నారు
