పసిబిడ్డ ప్రాణానికి అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి.

జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన బట్టి శ్యామల w/o రాజకుమార్ వీరికి 8 నెల బాబు ఉన్నాడు. వీరిది నిరుపేద కుటుంబం కావడంతో రాజకుమార్ మేకల కాపరిగా పని చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల వారి బాబు కొన్ని రోజుల నుండి అనారోగ్యంగా ఉండడంతో వారి బాబుని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆ బాబుకు చికిత్స చేసిన డాక్టర్లు బాబు లివర్ ఇన్ఫెక్షన్ వాళ్ల చెడిపోయిందని వెంటనే ఆపరేషన్ చేసి లివర్ మార్పిడి చేయాలని చెప్పారు. దీనికి సుమారు 25 లక్షలు దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆ విషయం విన్న బాబు అమ్మ నాన్న కన్నీరు మున్నీరు అయ్యి బొక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వారిది అన్ని డబ్బులు ఎక్కడ తేవాలో తెలియక తిరిగి ఇంటికి వచ్చారు వీరి విషయం న్యూస్ పేపర్ లో రావడంతో వెంటనే స్పందించిన *ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి గారు వారి ఇంటికి వెళ్లి వారికి మనోధైర్యం చెప్పి వారికి 10,000 పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే దాతలు ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి వీరి బాబుకు ప్రాణభిక్ష పెట్టాలని కోరు తున్నారు.

You may also like...

Translate »