దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలిఏఐసీసీ క్రైస్తవ నాయకులు డిమాండ్

దౌర్జన్యానికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి
ఏఐసీసీ క్రైస్తవ నాయకులు డిమాండ్
జ్ఞాన తెలంగాణ, కల్లూరు:
కల్లూరు మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంబడి తన నివాస గృహం నందు గత 45 సంవత్సరాలుగా నివాసముంటున్న పాతూరి కాంతమ్మ ఇంటి వద్దకి వచ్చే దారికి ఏర్పాటు చేసుకున్న దారీ గోడను దౌర్జన్యంగా పగల గొట్టి తీవ్ర మనస్థాపనకు గురి చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శుక్రవారం కాంగ్రెస్ మండల అధ్యక్షులు తేళ్ల ఎబినేజర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అత్యవసర సమావేశంలో సత్తుపల్లి నియోజకవర్గ ఏఐసీసీ క్రైస్తవ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా క్రైస్తవ నాయకులు మాట్లాడుతూ గత 45 సంవత్సరాలుగా అపోస్తులు సీమోను సతీమణి పాతూరి కాంతమ్మ ప్రధాన రహదారి వెంబడి నివాసముంటు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పరిసర ప్రాంతాలలో ఘనమైన దేవుని పరిచర్య కొనసాగించారు. పరిచర్య చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుతో 2018లో అపోస్తులు సీమోను మృతి చెందారు. తదనంతరం ఆయన సతీమణి కాంతమ్మ తన ఒంటరి కూతురితో పాటు ఆ గృహంలో నివాసం ఉంటూ దేవుని పరిచర్య కొనసాగిస్తున్నారు. ప్రజలను సన్మార్గంలో నడిపించే గొప్ప సేవకులుగా ఉన్న కుటుంబాన్ని 22 మే 2024న మంద అహరోను, బోయిని రూబేను, మట్టాడ జాకబ్ జాన్ మరి కొంతమందితో కలిసి కాంతమ్మ నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వచ్చి ఇల్లు ఖాళీ చేపిస్తామని బెదిరించి, దౌర్జన్యంగా సుమారు లక్ష 75 వేల రూపాయలతో నిర్మించుకున్న దారీ గోడను ధ్వంసం చేసి పడగొట్టారు. అన్యాయంగా దారీ గోడను పగలగొట్టి దైవజనురాలకు తీవ్ర నష్టం కలిగించడంతో నియోజకవర్గ ఏఐసీసీ క్రైస్తవ నాయకులు స్పందించి బాధితురాలకు న్యాయం జరిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చర్చిలపై, చర్చి స్థలాలపై దాడులు చేస్తే సహించేది లేదని జరుగుతున్న దాడులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. పోలీసు వ్యవస్థపై, చట్టాలపై నమ్మకం ఉందని న్యాయం జరిగే విధంగా చట్టాలకు లోబడి శాంతియుతంగా పనిచేయిoచుకుంటామని అన్నారు. ఇలాంటి సంఘటనల పట్ల క్రైస్తవ సమాజం అంత శాంతియుతంగా ఎదుర్కొంనేదుకు సిద్ధంగా ఉండాలని తెలియజేశారు.ఎవరైతే ఈ విధ్వంసానికి పాల్పడ్డారో ఇలాంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రేయర్ సెల్ జిల్లా అధ్యక్షులు టి.నిర్మల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్నాసి బాలరాజు, మీడియా సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి డేవిడ్ రాజు, మోదుగు ఓనేసిము,స్టీఫెన్, టి.సంజీవరావు,గడ్డం యోహాను, దాసరి నతానియల్, టి.ఇజ్రాయేల్, ఆర్.తిమోతి, మోదుగు జాన్ పరంజ్యోతి, పి.దయాకర్, అధూరి రాజశేఖర్, నారాయణ, జే.జాన్ పాల్, సందర్ రాజు, సుధీర్, ఐదు మండలాల క్రైస్తవ నాయకులు పాల్గొన్నారు.