జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన

జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన
జెడ్పి చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి
జ్ఞాన తెలంగాణ, (కందుకూరు)
మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల పరిధిలోని బైరాగి గుడ గ్రామంలో ఎంపీజే హాస్టల్ ను గూడూరు గేట్ దగ్గర ఉన్నా సోషల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాలను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి
ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మండ జ్యోతి పాండు,జడ్పిటిసి మొక్క జంగారెడ్డి,వైస్ ఎంపీపీ శమంత ప్రభాకర్ రెడ్డి,ఎంపిడిఓ, ఎంఈఓ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సారికొండ మల్లేష్, పాండు,బీసీ సెల్ అధ్యక్షుడు జగన్,యస్ టీ సెల్ అధ్యక్షుడు విశ్లవత్,శ్రీను,మాజీ ఉప సర్పంచ్ సుధాకర్ రెడ్డి, వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.జూన్ 12వ తేది నుండి పాఠశాలలు పున ప్రారంభించిన నేపథ్యంలో హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.విద్యార్థినులతో కలిసి భోజనం చేసారు.హాస్టల్ డైనింగ్ హాల్లో వంట గదిలో శుభ్రత పాటించాలని
ఉపాధ్యాలు సమయానికి విధులకు హాజరు కావాలి, శానిటైజేషన్ సిబ్బంది పరిసరాలను డైనింగ్ హాల్ ను బాత్రూమ్ లను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.బైరాగి గుడ లోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో శుభ్రత సరిగా లేదని ప్రిన్సిపాల్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.సోషల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాల శుభ్రంగా ఉందని కితాబు ఇచ్చారు.
తరగతి గదులను పరిశీలించి విద్యార్థినులు ప్రయోగ శాలలో ఏమి ప్రయోగం చేస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు.
ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని వాటిని పై అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు.