జాతీయ మెగా లోక్ అదాలత్ లో 5322 కేసులు పరిష్కారం.

జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిధి జూన్ 09

జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్లలో నమోదై అండర్ ఇన్వెస్టిగేషన్ కోర్టు విచారణలో ఉన్న కేసులలో ఐపీసీ కేసులు 652, ఈపెట్టి కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన తదితర పెట్టి కేసులు 4670, మొత్తం 5322 కేసులు పరిష్కరించబడినాయి.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ మాట్లాడుతూ, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది. గత 15 రోజుల నుండి కేసులలో ఉన్న కక్షిదారులను స్వయంగా కలిసి రాజీ మార్గం రాజ మార్గమని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని, ఇరు వర్గాలకు న్యాయం జరుగుతుందని. అవగాహన కల్పించినందున టార్గెట్ కు మించి కేసులు పరిష్కరించబడినాయి తెలిపారు.

కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీస్ అధికారులను సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. త్వరలో కోర్టు సిబ్బందికి రివార్డ్స్ అందజేస్తామని తెలిపారు.

You may also like...

Translate »