డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్స్ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య మండలి కొత్తగా ‘సైబర్ సెక్యూరిటీ’ కోర్సును సోమవారం ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టబోతోంది. దీంతో పాటు ఉన్నత విద్యలో అస్సెసెమెంట్ నివేదికను హైదరాబాద్ కేంద్రంగా మాసబ్ ట్యాంక్ వద్ద గల ఉన్నత విద్య మండలి కార్యాలయంలో ఆమె ఆవిష్కరించనున్నట్లు ఉన్నత విద్య మండలి కార్యదర్శి గారు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి డీజీపీ అంజన్ కుమార్ గారు, ఉన్నత విద్య శాఖా కార్యదర్శి వాకాటి కరుణ గారు, ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి గారు, ప్రొఫెసర్ వి.వెంకట రమణ గారు, ప్రొఫెసర్ ఎస్.కె.మహమూద్ గారు,తో పాటు ఉన్నత విద్యా శాఖ పరిధిలోని అన్ని తెలంగాణ రాష్ట్ర విశ్వ విద్యాలయాల వైస్-ఛాన్సలర్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సు పుస్తక రూపకర్తలు, ఐఎస్బీ అధికారులు హాజరుకానున్నారు.

You may also like...

Translate »