సిద్దిపేట గురుకులాలలో 5, 6,7,8,9 తరగతులలో ఖాళీ సీట్ల కు స్పాట్ అడ్మిషన్స్

Image Source | PngTree

జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 5 నుంచి 9 తరగతి వరకు ఖాళీగా ఉన్న SC సీట్లను ఈనెల 23న సిద్దిపేట అర్బన్ మిట్టపల్లి రెసిడెన్షియల్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్ నిర్వహిస్తామని రీజినల్ కోఆర్డినేటర్ నిర్మల గారు శుక్రవారం తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని సూచించారు. ఎస్సీ అనాధ సెమీ అనాధ పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని సంబంధిత ధ్రువపత్రం తీసుకొని రావాలని కోరారు.
2023 2024 వ సంవత్సరానికి వి.టి.జి.సి.ఈ.టి. వివిధ పరీక్షలలో సీటు వచ్చినప్పటికి జాయిన్ అవ్వని వారికి, తల్లి దండ్రులు లేని అనాధ బిడ్డలకు, వికలాగుల కు మొదటి ప్రాధాన్యం ఉంటుందన్నారు.
స్పాట్ అడ్మిషన్స్ కొరకు హాజరయ్యేవారు వారి యోక్క హల్టికెట్, ర్యాంక్ కార్డులను వెంట తీసుకోని రావాలిని తెలిపారు,
అనాధ బిడ్డలు వారి చనిపోయిన తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలని, వికలాగులు వారి వికలాంగుల పత్రాలను తీసుకొని రావాలని అన్నారు.

You may also like...

Translate »