మెదక్ ఎంపీ గెలుపు పట్ల తోడుపునూరి వెంకటేశం హర్షం వ్యక్తం.

జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిధి జూన్ 6.

మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గెలుపు పట్ల బీజేపీ నేత తొడుపునూరి వెంకటేశం హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలను చిత్తు చేస్తూ మెదక్ ఖిల్లాపై బీజేపీ జెండా ఎగురవేసామన్నారు. వాడింది గులాబీ వికసించింది కమలం అని కొని ఆడారు.

పార్టీ కోసం పార్టీ శ్రేణుల కోసం పార్టీ నాయకత్వ అడుగుజాడల్లో నడుస్తున్న రఘునందన్ రావు గెలిపించడం పట్ల మెదక్ పార్లమెంట్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు రాబోయే రోజుల్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం ఎంపీగా రఘునందన్ రావు తన శక్తివంచన లేకుండా కృషి చేస్తాడని అన్నారు.

దేశ భవిష్యత్ తీర్చిదిద్దే మోడీ నాయకత్వంలో మన మెదక్ ఎంపీ రఘునందన్ రావు పలుపంచుకుంటారని దేశ ప్రజల రక్షణకే బిజెపి కవచంలా ఉందన్నారు.

రఘన్న నాయకత్వంలో మన మెదక్ పార్లమెంటు నియోజక వర్గాన్ని అబివృద్ధి చేసుకుందామని అన్నారు.

You may also like...

Translate »