మంచినీటికి గోసపడుతున్న దళితులు

మంచినీటికి గోసపడుతున్న దళితులు
పట్టించుకోని అధికారులు
జిల్లా కలెక్టర్ స్పందించి ఆదుకోవాలి
జ్ఞానతెలంగాణ, చిట్యాల, జూన్06:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేటకు చెందిన దళిత కాలనీవాసులు మంచినీటి సౌకర్యం లేక గోసపడుతున్నారు. గ్రామపంచాయతీల్లో స్పెషల్ అధికారుల పాలన మొదలైనప్పటి నుండి గ్రామంలోని సమస్యలపై అధికారులు పట్టించుకోకపోవడంతో మంచినీటికి కరువు ఏర్పడిందని ఆ కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. గతంలో మాకు ఏ సమస్య ఏర్పడిన మేము సర్పంచ్ దగ్గరకు వెళ్లి పనులు చేయించుకునే వారమని, ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ల పాలనలో స్పెషల్ అధికారి రాకపోవడంతో సమస్యలను మేము పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆమె పట్టింపు లేని ధోరణితో వ్యవహరించడం వల్లనే మంచినీటి కొరత ఏర్పడిందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్పందించి తాగునీటి ఎద్దడిని నివారించి నవాబుపేట గ్రామంలోని దళిత కాలనీవాసులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించేందుకు చర్యలను తీసుకోవాలని వారు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.