కొత్త లైన్స్ క్లబ్ చేరడానికి యువతకు ఆహ్వానం

కందుకూరు లైన్స్ క్లబ్ చాటర్ సెక్రెటరీ తాళ్ల అంజయ్య

జ్ఞాన తెలంగాణ, (కందుకూరు)

కందుకూరు మండలంలో 18 సంవత్సరాల క్రితం కందుకూరు పేరున లైన్స్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగిందని కందుకూరు లైన్స్ క్లబ్ చాటర్ సెక్రెటరీ తాళ్ల అంజయ్య తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఇందులో సీనియర్స్ అధికంగా ఉన్నారు కావున యువత కోసం కొత్త లైన్స్ క్లబ్ ను కందుకూరు లో మరో కొత్త లైన్స్ క్లబ్ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించడం జరిగిందని కావున సేవా భావం కలిగిన యువత ను లైన్స్ క్లబ్ లో చేరేందుకు ఆహ్వానిస్తున్నాం అని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంజయ్య కోరారు. అందరికీ జీవితం ఒకటే ఉంటుంది.

ఆ జీవితాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఇది చక్కని అవకాశం మనము ఎదగడానికి సమాజం ఎంతగానో తోడ్పడింది మరి మనం ఎదిగిన తర్వాత సమాజంలోని పేదలకు ఆకలి తీర్చడానికి విద్యార్థులకు మీతో సంపత్తి కలిగించడానికి మన వంతు సహాయ సహకారాలు అందించేందుకు ఇది చక్కని అవకాశం నాయకత్వ లక్షణాలతో యువత ఎదగడంతోపాటు సమాజానికి సేవ చేయడానికి యువత మీ అమూల్యమైన సమయం ఆర్థిక సహాయం టాలెంట్ను ఉపయోగించుకునే అవకాశం వచ్చింది మీకు తోడుగా సీనియర్ లైన్స్ క్లబ్ కందుకూరు ఎల్లవేళలా తోడుగా ఉంటుందని ఈ కొత్త క్లబ్ లో చేరాలనుకుంటున్న యువతి యువకులు కందుకూర్ క్లబ్ చాటర్ అధ్యక్షులు డాక్టర్ గడ్డం మహేంద్ర కుమార్ రెడ్డి 9848482646, మాజీ ఈనాడు రిపోర్టర్ ,కందుకూరు లైన్స్ క్లబ్ చాటర్ సెక్రెటరీ తాళ్ల అంజయ్య 9440996939 గార్లను ఫోన్లో గాని ప్రత్యక్షంగా గాని కలిసి మీ ఒపీనియన్ ని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కందుకూరు మండల యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని అంజయ్య కోరారు.

You may also like...

Translate »