చేవెళ్ల లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం

చేవెళ్ల లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం
జ్ఞాన తెలంగాణ
చేవెళ్ల జూన్ 04
చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఫలితాల లెక్కింపులో నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో 23 రౌండ్లలో పూర్తిగా బిజెపి దండయాత్ర కొనసాగింది.
మొత్తం పోస్టల్ బ్యాలెట్ 19397 ఓట్లు పోలవగా. ఇందులో కాంగ్రెస్ 6124, బిఆర్ఎస్ 1428 బిజెపి 11365 తో ఆదిక్యత మెజారిటీని కనబరిచింది.ఈవీఎం ఓట్ల లెక్కింపులోను బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి
గడ్డం రంజిత్ రెడ్డి పై అదే ఆదిపత్య పోరును కొనసాగిస్తూ వచ్చింది. ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదటి రౌండులో బిజెపి 13,920 ఓట్ల మెజారిటీ తో కాంగ్రెస్ ను లీడ్ చేస్తూ ఆధిక్యతను కొనసాగిస్తూ వచ్చింది.ప్రతి రౌండ్ లోను బిజెపి హవ కొనసాగింది. చివరి రౌండ్ లో బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి 172892 ఓట్ల భారీ మెజారిటీతో విజయ డంక మోగించింది . విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుతో చేవెళ్ల నియోజకవర్గ బిజెపి నాయకులు కార్యకర్తలు చేవెళ్ల మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి పటాసులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.
కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి
ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలో
మద్యంతరంగా కౌంటింగ్ సెంటర్ నుండి
బయటకు వెళ్ళిపోయారు. అనంతరం మీడియాతో తన ఓటమిని అంగీకరించినట్టు
తెలుపుతూ. ఎన్నికల్లో గెలిచిన కొండ విశ్వేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. రంజిత్ రెడ్డి తన గెలుపు కోసం కృషిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని
తెలిపారు.