ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి
జ్ఞాన తెలంగాణ సిద్దిపేట:
గురువారము రోజున సిద్ధిపేట జిల్లాలోని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ SC విభాగం మండల అధ్యక్షుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదు అని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా SC డిపార్ట్మెంట్ చైర్మన్ కొమ్ము విజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పార్టీ SC విభాగం మండలాధ్యక్షుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేవిధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని , ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడెలా చేయడమే కాంగ్రెస్ పార్టీ యెక్క లక్ష్యం అని ఆయన అన్నారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు మాట్లాడుతూ కష్టపడ్డ ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని అని అందులో ఏటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు అని అన్నారు.రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్నందున పార్టీ కష్టకాలంలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు లబ్ది చేకూరే విదంగా తనవంతు సహకారం ఉంటుందన్నారు అనంతరం జిల్లా అధ్యక్షులు విజయు కుమార్ గారిని గజ మాల తో ఘనంగా సన్మానించారు .ఈకార్యక్రమంలోచిన్నకోడూరు మండల పార్టీ అధ్యక్షులు మీసం మహేందర్, రూరల్ మండల అధ్యక్షులు గరిపల్లి రాములు యాదవ్ ఉప అధ్యక్షులు సంధబోయిన పర్శరాం, యూత్ కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని గణేష్, sc సెల్ చిన్నకోడూరు మండల కన్వీనర్ కొమ్ము ప్రశాంత్, nsui మండల ప్రధాన కార్యధర్శి గుంజే రాజేందర్ జిల్లా లోని వివిధ మండలాల sc డిపార్ట్మెంట్ అధ్యక్షులు రమేష్ , నరహరి, మల్లేశం, కనకయ్య, పుట్ల యేసు , బాలయ్య,సీనియర్ నాయకులు నాయకులు పొన్నాల రాజేష్, మెట్ల అజయ్, శ్రీనివాస్ రెడ్డి, కొమ్ము రాజు, కోదాడి రమేష్, బండి శివకుమార్, పుల్లూరు కనకయ్య మనోజ్ తదితరులు పాల్గొన్నారు