బీసీ కులాల గణన చేపట్టాలి:

జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్ మే 29:

నారాయణపేట జిల్లా బీసీ సేన ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహిస్తు ఆరు నెలల లోపు బీసీ కులాల గణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు ముగుస్తున్న బీసీ కులాల గణన,
చేపట్టకపోగా, సకాలంలో నిర్వహించాల్సిన సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేయడం వల్ల
గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతుందని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, బీసీ కులాల గణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలు నిర్వహించాలని
సూపరిండెంట్ బాల్ చందర్ కు మెమోరాండం అందజేసిన బీసీసేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణయాదవ్
అనంతరం బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఒకేరోజులో సకలజనుల సర్వే నిర్వహించి సబండావర్గాల ప్రజల సంపూర్ణ సమాచారాన్ని, సేకరించిందని తెలిపారు, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వారం గడువు లోపల రాష్ట్రంలోని బీసీల జనాభా గల సంపూర్ణంగా చేపట్టవచ్చు అని, ఆలస్యం చేయడం కేవలం రాజకీయ కారణమేనని, తక్షణమే ముఖ్యమంత్రి, బీసీ కులాల ఘనంగా చేపట్టి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, లేని యెడల బిసి సేన ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, జిల్లా కన్వీనర్, వీరేష్, జిల్లా కార్యదర్శి అంజనేయులు యాదవ్, నియోజకవర్గ అధ్యక్షులు కురుమయ్య, నియోజకవర్గం ఉపాధ్యక్షులు గణేష్, ఆంజినేయులు,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »