ప్రజల గొంతుకని దీవించండి

ప్రజల గొంతుకని దీవించండి
-..తీన్మార్ మల్లన్న గెలిపించండి
-కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఎర్రబెల్లి పున్నం చందర్ రావు
జ్ఞాన తెలంగాణ, మొగుళ్ళపల్లి ప్రజల తరపున నిరంతరం పోరాడే తీన్మార్ మల్లన్నను నేడు జరగబోయే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో తమరి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకొని..ప్రజల పక్షాన పోరాడే గొంతుకని దీవించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు ఎర్రబెల్లి పున్నం చందర్ రావు పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజాస్వామ్యం తరఫున పోరాడిన వ్యక్తి నేడు కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచారన్నారు. గత పది ఏండ్లుగా అన్ని రంగాలలో వైఫల్యం చెందిన రాష్ట్రంలోని బీఆర్ఎస్, కేంద్రంలోని బిజెపి నాయకులకు బుద్ధి చెప్పేందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు దోహదపడతాయని, పట్టభద్రులు తమ అమూల్యమైన ఓటును తీన్మార్ మల్లన్నకు వేసి ప్రజల పక్షాన మాట్లాడే గొంతుకను శాసనమండలిలో నిలపాలన్నారు. ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమేనని, శాసనమండలిలో సైతం కాంగ్రెస్ గొంతుక ఉంటేనే ప్రజలకు న్యాయం చేకూరుతుందన్నారు. పట్టబద్రులంతా ఆలోచించి..మోసపూరిత మాటలకు మోసపోకుండా ప్రశ్నించే గొంతుకగు తీన్మార్ మల్లన్నను గెలిపించి తెలంగాణ అమరవీరుల ఆశయాలకు బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.