కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ పార్టీ

కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ పార్టీ
జ్ఞాన తెలంగాణ సిద్దిపేట:
కార్యకర్తలకు కంటికి రెప్పలా,పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండ గా, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వమున్న ప్రతి కార్యకర్తలకు ప్రమాద భీమా.
నంగునూర్ కు చెందిన పార్టీ కార్యకర్త కు 2లక్షల మంజూరు బాధిత కుటుంబానికి చెక్కుల పంపిణీ చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సభ్యత్వం కల్గివున్న ప్రతి కార్యకర్తకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిందని పార్టీ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబసభ్యులకు అండగా నిలిచేందుకు ఈ ప్రమాద భీమా సదుపాయం కల్పిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు తెలిపారు. ఇలా ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తున్నామన్నారు. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు.. సిద్దిపేట నియోజకవర్గం లోని ఇప్పటి వరకు 48 మంది కీ 2లక్షల చొప్పున 96 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి.పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండేందుకే ఈ భీమా సదుపాయం కల్పించినట్లు తెలిపారు. పార్టీ సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు చనిపోయిన ప్రతి కుటుంబానికి పార్టీ పక్షాన ఇన్సూరెన్స్ చేసి ₹2 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. నంగునూర్ మండల కేంద్రం కీ చెందిన సుంచన కోట యాదగిరి ఇటీవల ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోగ వారి కుటుంబానికి పార్టీ ఇన్సూరెన్స్ 2లక్షలు మంజూరు అయింది భార్య మాదవి కీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఆ చెక్ ను అందజేశారు.
