ఘనంగా శివ కుమార్ దంపతుల వివాహ వార్షికోత్సవ సంబరాలు

జ్ఞాన తెలంగాణ చేవెళ్ల మే 21

అందమైన తోడు దొరకడం కాదు, బాధ్యతగల తోడు దొరకడం అదృష్టం వివాహాలు స్వర్గంలో నిశ్చయం అవుతాయని పెద్దలు చెబుతుంటారు అయితే బరువు బాధ్యతలు సమానంగా పంచుకొని కార్యేషు దాసి కరణశు మంత్రిగా సూచన సలహాలు పాటిస్తున్న ఆదర్శ దంపతులు బిఆర్ఎస్ కందవాడ సీనియర్ నాయకులు మాజీ వార్డ మెంబర్ శివ కుమార్ దంపతులు అని ఎంపీటీసీ రవీందర్ యాదవ్ మల్లేష్ పలువురు నాయకులు అభిమానులు కార్యకర్తలు కొనియాడారు.
వార్షికోత్సవ సంబరాలు వారి స్వగృహంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు అభిమానులు శాలువా పూలమాలలతో దంపతులను సత్కరించారు. సామాజిక సేవలో భార్యాభర్తలు ఇరువురు కలిసి సేవే పరమావధిగా పాటించడం ఎంతోమంది ప్రజలకు ఆదర్శంగా నిలవడం వారి అదృష్టమని పలువురు కొనియాడారు ఈ కార్యక్రమంలో కె పాండు యాదవ్ మొడంపల్లి వెంకటేష్ కురువ సత్యనారాయణ శీను నాయకులు పాల్గొన్నారు

You may also like...

Translate »