శంషాబాద్ లో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి వేడుకలు

  • నివాళులు అర్పించిన గడ్డం శేఖర్ యాదవ్

జ్ఞాన తెలంగాణ
రాజేంద్రనగర్

నియోజకవర్గంలోని శంషాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం శేఖర్ యాదవ్ మాజీ ప్రధాన మంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 33 వ వర్ధంతి కార్యక్రమం లో పాల్గొని రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా గడ్డం శేఖర్ యాదవ్ మాట్లాడుతూ
ఆధునిక భారతదేశానికి పునాదులు వేసి, అణగారిన బతుకుల్లో వెలుగు నింపి, ఆఖరి క్షణం వరకు దేశం కోసమే బతికిన
మహానేత, మాజీ ప్రధాని
శ్రీ రాజీవ్ గాంధీ గారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంజు అజీజ్ రాఖీ పాండు యాదవ్ ఆదర్శ్ వినోద్ సిద్దు కిరణ్ ఇంతియాజ్ అభిషేక్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like...

Translate »