జల సంరక్షణలో వికారాబాద్ జిల్లా ముందంజ!.

జల సంరక్షణలో వికారాబాద్ జిల్లా ముందంజ!
జ్ఞాన తెలంగాణ న్యూస్
వికారాబాద్ జిల్లా
నవాబుపేట మండలం
జల సంరక్షణలో భాగంగా చేపడుతున్న పనుల్లో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం అందించిన అవార్డుల్లో అనేక విభాగాల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు దక్కించుకున్న జిల్లా ఈ ఏడాది కూడా రేసులో ముందుంది. వర్షపు నీటిని ఒడిసిపట్టడం, వాటి వినియోగం, సాధించిన ఫలితాల ఆధారంగా ఎంపిక చేసిన జాబితాలో తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో చోటు దక్కించుకుంది. దీంతో మరోసారి అవార్డు దక్కే అవకాశాలు ఉన్నాయి.