ఆర్ధిక సాయం అందజేత..కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుర్రం లక్ష్మారెడ్డి.

జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 20.

వలిగొండ మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామానికి చెందిన కందుల దీలీప్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా అతని ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుర్రం లక్ష్మారెడ్డి సౌజన్యంతో ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు.అలాగే అదే గ్రామానికి చెందిన కేశవదాసు లక్ష్మీనారాయణ ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గుర్రం లక్ష్మారెడ్డి సౌజన్యంతో ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నోముల మల్లేష్,సిరికొండ జహంగీర్,కందుల శ్రీను,కందుల మహేష్,బోదాసు బాలరాజు, చిట్టబోయిన రమేష్,సుంకరి నర్సింహ,కందుల నవీన్,తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »