శిథిలావస్థలోఇందిరమ్మ గృహాలు

జ్ఞాన తెలంగాణ
శంషాబాద్

మండలంలోని రాళ్లగూడ ఇంద్రారెడ్డి నగర్ పక్కనే ఉన్న ఇందిరమ్మ గృహాలు రేపో మాపో కులే తట్టు ఉన్నాయ్ గృహాలు కట్టి ఇరవై సంవత్సరములు కాక ముందే కొన్ని బ్లాక్ లు శిథిలావస్తా స్థితిలో ఉన్నాయి అందులో నివసిస్తున్న కుటుంబాలు భయం భయంతో జీవిస్తున్నారు.మరోవైపు డ్రైనేజి పొంగి పొర్లడంతో దుర్వాసన సమస్యతో ప్రజలు సతమతమవుతున్నారు. అధికారులకు నాయకులకు పాలు సార్లు తమ సమస్యలను చెప్పిన పట్టించుకోలేరన్నారు.
నాయకులు కేవలం ఓట్లు అడగడానికి మాత్రమే వస్తారు ఆ తర్వత మల్లి కనపడరని అన్నారు.

నిర్మాణంలో నాన్యత లోపం

ఇందిరమ్మ గృహాలు నిర్మించేటపుడు నాన్యతను పాటించినట్లైతే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని స్థానికులు అన్నారు.
ప్రభుత్వం నిర్మాణం చెపట్టినపుడు తగిన చర్యలు తీసుకోని పకడ్బందీగా నిర్మించి నాన్యమైన సిమెంట్ ,ఇసుక తో కట్టి నీళ్ళు సరిగ్గ పట్టి ఉంటే గోడలు దృడంగా ఉండేవి అని అన్నారు.ఇప్పుడు ఉన్న గొడలన్ని కూడా వర్షాలు పాడినపుడు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయి .దీనికీగల కారణం నాన్యతలోపమే అని స్టానికులు మండి పడుతున్నరు.

You may also like...

Translate »