ఘనంగాపుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి

ఘనంగాపుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి
జ్ఞాన తెలంగాణ చేవెళ్ల
ఘనంగాపుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి ఘనంగా జరిగింది.సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్
ఈరోజు మొయినాబాద్ మండల పరిధిలోని నాగిరెడ్డి గూడా గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ హాజరై మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య తన జీవితాన్ని మొత్తం పేద ప్రజల కోసం త్యాగం చేసిన గొప్ప యోధుడని అన్నారు దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నిర్మించడం అలాగే కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా పనిచేసే సైకిల్పై పార్లమెంటుకు వెళ్లిన గొప్ప నాయకుడు అని అన్నారు పేదల కోసం సుందర్ రామిరెడ్డి సుందరయ్యగా మారాడు అలాగే ఎవరూ చేయని త్యాగం పేద ప్రజల కోసం బిడ్డలను కూడా తనని గొప్ప కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆయన ఆశయ సాధనం కోసం ఎర్రజెండా నిరంతరం పేద ప్రజల తరఫున అనేక పోరాటాలు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మొయినాబాద్ మండల అధ్యక్షుడు ప్రభుదాస్ నాగిరెడ్డి గూడా మాజీ సర్పంచ్ సద్గుణ చారి కోశాధికారి అశోక్ శ్రీనివాస్ వెంకటయ్య అర్జున్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు