జగన్ ఫార్ములాతో కేసీఆర్ నిర్ణయాలకు రేవంత్ బ్రేక్..!!

తెలంగాణలో కీలక నిర్ణయాల దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు. త్వరలో జరిగే పంచాయితీ ఎన్నికల తరువాత పాలనా పరమైన సంస్కరణలకు సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా జిల్లాల కుదింపు పైన రేవంత్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. కేసీఆర్ నాడు తెలంగాణలో 10 ఉమ్మడి జిల్లాలను 33 జిల్లాలు చేసారు. ఇప్పుడు వీటి సంఖ్య తగ్గించేలా రేవంత్ ఆలోచన చేస్తున్నారు. ఇందు కోసం ఏపీలో జగన్ సర్కార్ ఫార్ములాను అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లాల కుదింపు రేవంత్ ప్రభుత్వం జిల్లాల కుదింపు పైన ఫోకస్ చేసింది. కేసీఆర్ నాడు అధికారంలో ఉన్న సమయంలో 33 జిల్లాలు చేసారు. ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక ఫార్ములా ప్రకారం జిల్లాల సంఖ్య పెంచారు. ఏపీలో 13 ఉమ్మడి జిల్లాలు ఉండగా..పార్లమెంట్ నియోజకర్గాల వారీగా వాటిని 25కి పెంచారు. ఇప్పుడు అదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాల్లో ఒక్కో జిల్లా చొప్పున పునర్విభజన చేసేందుకు రెడీ అవుతున్నారు.
17కి తగ్గించేలా పాలన సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను ప్రస్తుతమున్న 33 నుంచి 17 కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే జిల్లా విస్తరణ అశాస్త్రీయమని విమర్శించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆదిశ చర్యలు చేపట్టనున్నారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియను సమీక్షించేందుకు జ్యుడిషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ యోచిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం నాడు పరిపాలనా సౌలభ్యం కోసం పది జిల్లాలకు 23 కొత్త జిల్లాలుగా మార్చింది గత ప్రభుత్వం. 33 జిల్లాలు ఏర్పాటుతో రాష్ట్ర రూపు రేఖలే మారిపోయాయి. పాత జిల్లాలు ఒక్కో చోట 5 జిల్లాలు విడిపోవడంతో ప్రజల్లో అనేక సమస్యలు తెలత్తాయి. పాలన కూడా కొంత ఇబ్బంది మారిందని అధికార వర్గాల సమాచారం.
కమిషన్ నియామకం ఒక ఎంపీ నాలుగు జిల్లాల పరిధిలోకి రావడంతో నిధులను ఖర్చు చేయడంలో తీవ్ర ప్రభావం చూపుతోంది. అంతేకాక స్థానిక పరిపాలనలోను అనేక ఇబ్బందులు తలెత్తున్నాయంటూ అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఎన్నికలకు ముందు నూతన జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అభయహస్తం మ్యానిఫెస్టోలో చేర్చంది.
కొత్తగా ఏర్పాటు చేసే ఒక జిల్లాకు పీవీ నరసింహరావు పేరు పెడతామని.. జనగాం జిల్లా పేరు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. అదే తరహాలో ఉన్నతాధికారులతో జ్యుడిషియల్ కమీషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. కమిటీ నివేదిక అసెంబ్లీలో చర్చించి..తుది నిర్ణయం తీసుకోనున్నా