అనాధాశ్రమంలో పెళ్లి వేడుకలు

అనాధాశ్రమంలో పెళ్లి వేడుకలు
జ్ఞానతెలంగాణ, చిట్యాల, మే 17:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనూ కేటీకె ఓసి (2) లోసీనియర్ అండర్ మేనేజర్ సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు భూక్యా మోహన్ విజయలక్ష్మి దంపతుల పెళ్లిరోజు వేడుకలు జిల్లా కేంద్రంలోని అమృత వర్షిని అనాధ ఆశ్రమంలో పెళ్లిరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి అనాధాశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అమృత వర్షిని అనాధ ఆశ్రమం వ్యవస్థా అధ్యక్షులు శ్యామ్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని కేటీకె ఓసి 2 లో సీనియర్ అండర్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న భూక్యా మోహన్, విజయలక్ష్మి , దంపతుల పెళ్లిరోజు అనాధాశ్రమంలో నిర్వహించడం చాలా సంతోషకరమని వారి తమ పిల్లల పుట్టిన రోజు వేడుకలు కూడా అనాధాశ్రమంలో నిర్వహిస్తారని ,వృద్ధులకు అన్నదాన కార్యక్రమం పండ్లు పంపిణీ, ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని అనాధాశ్రమానికి తమ వంతు ఆర్థిక సాయం కుడా అందిస్తున్నారు అనాధాశ్రమానికి అండగా నిలుస్తున్న భూక్యా మోహన్ విజయలక్ష్మి,దంపతులకు అభినందనలు తెలుపుతూ ఆ పుణ్య దంపతులకు ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు వారి మీద వారి కుటుంబం మీద ఉండాలని మునుముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో సాయి ప్రకాష్, దీపిక రాథోడ్, ఆత్మీయ సేవ సమితి అధ్యక్షులు మహేందర్, హేమ నాయక్, రాములు, తదితరులు పాల్గొన్నారు